Featured

Playing Music on Speaker Mode Banned in KSRTC Buses | బస్సుల్లో ఫోన్లలో శబ్దంతో కూడిన పాటలు నిషేధం



Published
KSRTC బస్సుల్లో ప్రయాణికులు తమ మొబైల్ స్పీకర్లలో అధిక శబ్దంతో పాటలు ప్లే చేయడాన్ని కర్ణాటక హైకోర్టు నిషేధించింది. ఇక నుంచి అలా చేస్తే వారిని బస్సులోనుంచి కిందికి దించేయొచ్చని తెలిపింది. అందరికీ వినిపించేలా పాటలు పెట్టడం తోటి ప్రయాణికులకు ఇబ్బందికర వ్యవహారమేనని తేల్చి చెప్పింది. బస్సు లోపల 'నాయిస్ డిస్ట్రబెన్స్ ' విషయంలో ఆంక్షలు విధించాలని కోరుతూ ఓ పిటిషనర్ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మొబైల్ ఫోన్లలో అధిక శబ్దంతో పాటలు, వీడియోలు ప్లే చేయడాన్ని కట్టడి చేయాలని అందులో కోరారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బస్సులో ఎవరైనా తమ ఫోన్లలో అధిక వాల్యూమ్ పెడితే.. బస్సు కండక్టర్ పెట్టినవారిని మొదట వారించాలని తెలిపింది. కండక్టర్ మాటలను పట్టించుకోనట్లైతే.. సదరు ప్రయాణికుడు బస్సు దిగే వరకు డ్రైవర్ బస్సును నిలిపి ఉంచాలని పేర్కొంది. అయినప్పటికీ ప్రయాణికుడు బస్సు దిగకపోతే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎవరైనా ఫిర్యాదు చేయాలని వెల్లడించింది. KSRTC తాజా నిర్ణయాన్ని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Category
Audio
Be the first to comment